తెలంగాణ కరోనా అప్‌డేట్..

197
corona
- Advertisement -

తెలంగాణలో కరోపా పాజిటివ్ కేసుల సంఖ్య రెండు లక్షల 26 వేలు దాటింది. గత 24 గంటల్లో 1,579 పాజిటివ్ కేసులు నమోదు కాగా 5గురు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 2,26,124కు చేరాయి.

కరోనాతో 1287 మంది మృతిచెందగా 2,04,388 మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,449 యాక్టివ్ కేసులు ఉండగా రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.56 శాతంగా ఉంది.

కరోనా రికవరీ రేటు దేశంలో 88.8 శాతంగా ఉంటే తెలంగాణలో 90.38 శాతానికి పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 41,475 కరోనా శాంపిల్స్ పరీక్షించగా.. ఇప్పటి వరకు 39,40,304 శాంపిల్స్ టెస్టులు చేసినట్లు వైద్యా రోగ్య తెలిపింది.

- Advertisement -