దేశంలో 80 లక్షలకు చేరువలో కరోనా కేసులు..

321
corona
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 43, 893 పాజిటివ్ కేసులు నమోదుకాగా 508 మంది మృతిచెందారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 79,90,322కి చేరాయి.

ప్రస్తుతం దేశంలో 6,10,803 యాక్టివ్ కేసులుండగా ఇప్పటివరకు కరోనాతో లక్షా 20 వేల మంది మృతిచెందారు. కరోనా మహమ్మారి నుండి 72,59,509 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 58,439 మంది కోలుకున్నారని వైద్యశాఖ అధికారులు తెలిపారు.

- Advertisement -