దేశంలో 24 గంటల్లో 95,735 కరోనా కేసులు

176
corona

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకు లక్షకు చేరువలో కరోనా కేసులు నమోదవుతుండగా దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 45 లక్షల మార్కును దాటాయి.

గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 96,551 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 76,271 మంది మృతిచెందారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 45,62,415కు చేరగా 9,43,480 యాక్టివ్ కేసులున్నాయి. 35,42,664 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు.

దేశంలో ఇప్పటివరకు 5,40,97,975 మందికి క‌రోనా టెస్టులు చేయగా 24 గంటల్లో 11,63,542 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని ఐసీఎంఆర్ తెలిపింది.