రాష్ట్రంలో 24 గంటల్లో 2426 కరోనా కేసులు..

124
coronavirus

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 2426 పాజిటివ్ కేసులు నమోదుకాగా 13 మంది కరోనాతో మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,52,602కి చేరాయి.

కరోనాతో ఇప్పటివరకు 940 మంది మృతిచెందగా 1,19,467 యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 32,195 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో క‌రోనా రిక‌వ‌రీ రేటు 78.2 శాతంగా ఉండ‌గా, క‌రోనా మ‌ర‌ణాల రేటు 0.61 శాతంగా ఉన్న‌దని వైద్య ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టించింది.

జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే జీహెచ్ఎంసీ ప‌రిధిలో 338 కేసులు న‌మోదుకాగా రంగారెడ్డి జిల్లాలో 216, మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరిలో 172, న‌ల్ల‌గొండ‌లో 164, క‌రీంన‌గ‌ర్‌లో 129, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌లో 108, ఖ‌మ్మం 98, సంగారెడ్డి 97, నిజామాబాద్ 89, సిద్దిపేట 87, సూర్యాపేట 78, మ‌హ‌బూబాబాద్ 76, భ‌ద్రాద్రికొత్త‌గూడెం 67, జ‌గిత్యాల 62, మంచిర్యాల 57, పెద్ద‌ప‌ల్లి 56, కామారెడ్డి 54, నాగ‌ర్‌క‌ర్నూల్ 50, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ 46, యాదాద్రిభువ‌న‌గిరి 43, మెద‌క్ 42, రాజ‌న్న‌సిరిసిల్ల 41, వ‌న‌ప‌ర్తి 38, జ‌న‌గాం 33 నమోదయ్యాయి.