- Advertisement -
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 28 లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డుస్థాయిలో 64,531 కరోనా కేసులు నమోదుకాగా 1092 మంది మృతిచెందారు.
దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27,67,274కు చేరగా 6,76,514 యాక్టివ్ కేసులున్నాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు కరోనాతో 52,889 మంది మృతిచెందగా 20,37,871 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 3,17,42,782 నమూనాలను పరీక్షించగా ఆగస్టు 18న 8,01,518 మందికి కరోనా పరీక్షలు చేశామని ఐసీఎంఆర్ వెల్లడించింది.
- Advertisement -