దేశంలో 24 గంటల్లో 86,052 కరోనా కేసులు..

132
coronavirus

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 58 లక్షలు దాటాయి. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 86,052 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 1,141 మంది మ‌ర‌ణించారు.

దీంతో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 58,18,571కు చేరింది. ఇందులో 9,70,116 యాక్టివ్ కేసులు ఉండ‌గా, మ‌రో 47,56,165 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు.

ఇప్పటివరకు కరోనాతో 92,290 మంది మృతిచెందగా 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 13,80,000ల క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇంతపెద్ద‌సంఖ్య‌లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం ఇదే మొద‌టిసారి.