47 లక్షలు దాటిన కరోనా కేసులు…

165
corona in delhi

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. రోజుకు లక్షకు చేరువలో కరోనా కేసులు నమోదవుతుండగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 94,372 కొత్త పాజిటివ్ కేసులు నమోదుకాగా 1,114 మంది మృతిచెందారు.

ఇప్పటివరకు దేశంలో 47,54,356 కరోనా కేసులు నమోదవుతుండగా 78,586 మంది మృతిచెందారు. 24 గంటల్లో 78,399 మంది రికవరీ కాగా.పూర్తిగా కోలుకున్నవారి సంఖ్య 37,2595కు పెరిగింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు 9,73,175గా ఉండగా శనివారం ఒకేరోజు 10.71 లక్షల మందికి టెస్ట్‌లు నిర్వహించారు.. దీంతో..ఇప్పటి నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 5.62 కోట్లకు చేరినట్టు ఐసీఎంఆర్‌ ప్రకటించింది.