జేఈఈ మెయిన్స్‌ విజేత‌ల‌కు కేటీఆర్‌ అభినందనలు

186
KTR

జేఈఈ మెయిన్ 2020 ఫలితాలు శుక్రవారం విడుదలైయ్యాయి. ఇక ఈ ఫలితాల్లో తెలంగాణ బిడ్డలు అద్భుతంగా రాణించడం పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. జేఈఈ మెయిన్ రిజల్ట్స్ లో 100 పర్సంటైల్ స్కోరు సాధించింది దేశం మొత్తమ్మీద 24 మందే కాగా, వారిలో 8 మంది తెలంగాణ విద్యార్థులు ఉండడం విశేషం. ఇందులో చుక్కా తనూజ, వడ్డేపల్లి అరవింద్ కుమార్, రొంగల అరుణ్ సిద్ధార్థ, యశష్ చంద్ర, శిక్ష కృష్ణ సాగి, మోరెడ్డిగారి లిఖిత్ రెడ్డి, రాచపల్లె శశాంక్ అనిరుధ్, చాగరి కౌశల్ కుమార్ జేఈఈ మెయిన్ 2020లో మెరుగైన ర్యాంకులు సాధించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలపారు. “జేఈఈ మెయిన్ ఎగ్జామ్ లో తమ అమోఘమైన ప్రదర్శనతో అందరినీ గర్వించేలా చేసిన తెలంగాణ యువ కిశోరాలకు నా శుభాభినందనలు. ఓవరాల్ గా 24 మందికి 100 పర్సంటైల్ స్కోరు వస్తే వారిలో 8 మంది తెలంగాణ వాళ్లే. వాళ్లలో అమ్మాయిల విభాగం టాపర్ చుక్కా తనూజ కూడా ఉంది. అద్వితీయమైన సాధన” అంటూ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.