ఐర్లాండ్‌తో టీ20…భారత్ క్లీన్ స్వీప్

44
deepak
- Advertisement -

ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20ల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. 226 పరుగుల భారీ లక్ష్యచేదనలో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ గెలిచినంత పనిచేసింది. చివరి వరకు పోరాడి కేవలం 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఐర్లాండ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 221 పరుగులు చేసి ఓడింది. పెనర్లు బల్బర్నీ (37 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 60), స్టిర్లింగ్‌ (18 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 40) మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్‌ను వణికించారు. ఆ తర్వాత హ్యారీ టెక్టర్‌ (39), డాక్రెల్‌ (34 నాటౌట్‌), అడెయిర్‌ (23 నాటౌట్‌) చివర్లో పోరాడినా ఐర్లాండ్‌కు నిరాశే ఎదురైంది.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్లు కొల్పోయి 225 పరుగులు చేసింది. దీపక్‌ హుడా (57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 104) సెంచరీతో ఆకట్టుకోగా సంజూ శాంసన్‌ (42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 77) సత్తా చాటాడు.

- Advertisement -