దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..

132
r day
- Advertisement -

దేశ వ్యాప్తంగా గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు . అమ‌ర్‌ జ‌వాన్ జ్యోతి వ‌ద్ద ప్ర‌ధాని మోదీ ఇవాళ నివాళి అర్పించారు.

ల‌డ‌ఖ్‌లో గ‌డ్డ క‌ట్టిన మంచుపై ఇండో టిబెట‌న్ బోర్డ‌ర్ పోలీసు(ఐటీబీపీ) జ‌వాన్లు రిప‌బ్లిక్ డే వేడుకలు నిర్వ‌హించారు. జాతీయ జెండా చేత‌బూని గ‌డ్డ కట్టిన మంచుపై న‌డిచి దేశ‌భ‌క్తిని చాటుకున్నారు. ల‌డ‌ఖ్‌లోని అత్యంత ఎత్తైన ఔట్‌పోస్టు వ‌ద్ద మంచుకొండ‌ల మ‌ధ్య మువ్వ‌న్నెల జెండాను ఎగుర‌వేశారు.

ప్రగతి భవన్‌లో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు.

టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దేశ ప్ర‌జ‌లంద‌రికీ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. నిజ‌మైన స‌మాఖ్య‌స్ఫూర్తి ప‌రిఢ‌విల్లేలా భార‌త ప్ర‌జాస్వామ్య గ‌ణ‌తంత్ర వ్య‌వస్థ బ‌ల‌ప‌డాల‌ని ఆకాంక్షిస్తూ దేశ ప్ర‌జ‌లంద‌రికీ గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు.

- Advertisement -