ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి పేరు ఖరారైంది. 1946 జూలై 8 జన్మించారు జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, గోవా మొదటి లోకాయుక్త చైర్మన్ పనిచేశారు సుదర్శన్ రెడ్డి. 2007 జనవరి 12 నుండి 2011 జూలై 8 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు బి. సుదర్శన్ రెడ్డి.
ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీ. పి. రాధాకృష్ణన్‌ను ప్రకటించగా 2022లో తృణమూల్ కాంగ్రెస్ మాజీ కాంగ్రెస్ మంత్రి మార్గరెట్ ఆల్వాకు మద్దతు ఇవ్వకుండా ఉండటంతో ఓటు విభజన జరిగింది. ఆ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని ఈసారి రాజకీయ నాయకులను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
రాజ్యసభ, లోకసభ కలిపి 781 మంది సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏకి 424 మంది సభ్యులు ఉండటంతో రాధాకృష్ణన్ విజయం ఖాయమని చెప్పవచ్చు.
Also Read:జవాన్‌పై దాడి చేసిన టోల్‌గేట్ ధ్వంసం!
సుదర్శన్ రెడ్డి స్వస్థలం తెలంగాణలోని రంగారెడ్డి జల్లా ఆకుల మైలారం. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సుదర్శన్ రెడ్డి.. ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు. 1993లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005లో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2007లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
నల్లధనంపై కేంద్ర అలసత్వాన్ని విమర్శిస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సాల్వాజుడుమ్ చట్టవిరుద్దమని తీర్పునిచ్చారు. గోవాకు తొలి లోకాయుక్త ఛైర్మన్‌గా పనిచేశారు.

