టీ20 సిరీస్ భారత్ కైవసం..

71
ind

న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. రాంచీ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ పై భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 154 పరుగుల విజయలక్ష్యంతో దిగిన భారత్‌ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించింది.

కెప్టెన్ రోహిత్ (55. ఒక ఫోర్, 5 సిక్సులు), కేఎల్ రాహుల్ (65, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు) దూకుడుగా బ్యాటింగ్ చేసి భారత్‌ని గెలిపించారు. భారత్ కోల్పోయిన మూడు వికెట్లు సౌథీకే పడ్డాయి.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 153/6 స్కోరు చేసింది. ఓపెనర్లు గప్తిల్ (31), మిచెల్ (31) రాణించగా చాప్ మన్ (21), ఫిలిప్స్ (34) పర్వాలేదనిపించారు. హర్షల్ పటేల్ 2 వికెట్లు, భువనేశ్వర్, అశ్విన్, అక్షర్, దీపక్ చాహర్ ఒక్కో వికెట్ తీశారు.