బిగ్ బాస్ 5…అనీ మాస్టర్ ఎలిమినేట్

25
ani master

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 11 వారాలు పూర్తి చేసుకుంది. 11వ వారంలో భాగంగా ఇంటి నుండి అనీ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. బయటకు వచ్చిన ఆనీ ఒక్కొక్కరి గురించి తన అభిప్రాయాన్ని చెప్పింది. మొదటి నుంచి ఇప్పటి వరకు నన్ను రవి మోటివేట్ చేస్తూనే ఉన్నాడు.. టాప్ 3లో ఉండాలని చెప్పింది. శ్రీరామచంద్ర కూడా నాలానే. నీ కోసం ఉన్నానంటూ చెప్పడు. కానీ నాకు అవసరం ఉన్నప్పుడల్లా నాతోనే ఉన్నాడు అని తెలిపింది.

షన్నుతో అంత కనెక్షన్ లేకపోయినా కూడా.. ఆయన మాట్లాడినప్పుడు మాత్రం నిజాయితీగా మాట్లాడాడు….అలానే ఉండు అని సలహా ఇచ్చింది. సిరి పటాక టాస్కులు బాగా ఆడుతుంది.. ప్రియాంక బట్టర్ ఫ్లై నీ గేమ్ నువ్ ఆడు తెలపగా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే క్షమించాలని కోరింది. ఇక కాజల్‌కు టాప్ 8లో ఉన్నందుకు కంగ్రాట్స్ చెప్పింది. బయటకు వచ్చాక మనం మంచి ఫ్రెండ్స్ అవుదామని మానస్‌కు చెప్పగా నాకు ఎప్పటికీ ఫ్రెండ్ అని సన్నీ గురించి ఆనీ చెప్పింది.

ఇక అంతకముందు సన్‌ డే ఫన్‌డే టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులతో ఆటలాడించారు బిగ్ బాస్. ఒక్క కప్పు టీ, మీ కంటూ ఒంటరిగా ఒకరోజు గడిపే రోజు వస్తే ఎలా ఉంటారు అని చెప్పమంటూ వావ్ తాజ్‌ను ప్రమోట్ చేశారు. కంటెస్టెంట్లు తమ తమ అభిప్రాయాలను, ఊహలను, ఆశలను పంచుకున్నారు.

తర్వాత ప్రశ్నకు వేళాయే అంటూ.. కంటెస్టెంట్లు వేసిన ప్రశ్నలని.. కంటెస్టెంట్లకే వేసి వాటి సమాధానాలు బయటకు వచ్చేలా చేశాడు. అనుభవించురాజా సినిమా ప్రమోషన్‌లో భాగంగా రాజ్ తరుణ్, టీంతో కలిసి ఇంటి సభ్యులను సందడి చేయగా ఈ టాస్క్ ఆధ్యంతం సరదాగా సాగింది.