- Advertisement -
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్‌లో జరిగిన తొలి టీ20లో భారత్ గెలుపొందింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించగా తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత 12 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. హెర్రీ టెక్టార్ 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 64 పరుగులు చేయగా, వికెట్ కీపర్ టకర్ 16 బంతుల్లో 2 సిక్సర్లతో 18 పరుగులు చేశాడు.
అనంతరం 109 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 9.2 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ దీపక్ హుడా 29 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు (నాటౌట్) చేయగా, ఇషాన్ కిషన్ 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 26 పరుగులు చేశాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 12 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 24 పరుగులు చేశాడు.
- Advertisement -