మౌత్ టాక్‌తోనే సమ్మతమే బ్లాక్ బస్టర్ హిట్!

29
sammathame
- Advertisement -

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ “సమ్మతమే”. చాందిని చౌదరి కథానాయికగా నటిస్తోండ‌గా యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రంకు మంచి ఆదరణ లభిస్తోంది.

అ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో మాట్లాడిన హీరో కిరణ్… సమ్మతమే చూసిన ప్రేక్షకులు మా కథే తీశారు. మా జీవితంలో కూడా ఇలా జరిగింది అని అభినందించడం ఆనందంగా ఉందన్నారు. ప్రేక్షకులంతా విజిల్స్‌ వేస్తూ, ఒక మాస్‌ సినిమాని చూస్తున్నట్లు ఎంజాయ్‌ చేస్తున్నారని వెల్లడించారు.

థియేటర్ల సంఖ్య పెరిగింది. రిపీట్‌ ఆడియన్స్‌ వస్తున్నారు. ఇంకా చూడని వాళ్లు థియేటర్‌కు వెళ్లి చూడండి అని కోరారు. మౌత్‌టాక్‌తోనే సమ్మతమే బ్లాక్‌బస్టర్‌ అయిందనీ చిత్ర దర్శకుడు గోపీనాథ్‌రెడ్డి చెప్పారు.

- Advertisement -