గట్టిపోటీ ఇచ్చిన ఇండియా కూటమి

6
- Advertisement -

సార్వత్రిక ఎన్ఇకల్లో ఎన్డీయే కూటమికి గట్టి పోటీనిచ్చింది ఇండియా కూటమి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ 224 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉంది. ఎన్డీయే 291 స్థానాల్లో లీడ్‌లో ఉంది.

ఇక పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ లీడ్‌లో ఉన్నారు రాహుల్ గాంధీ. హిందీ రాష్ట్రాల్లో బీజేపీ లీడింగ్‌లో ఉండ‌గా, త‌మిళ‌నాడు, యూపీ, మ‌హారాష్ట్ర‌లో ఇండియా కూట‌మి ఆధిక్యంలో ఉన్న‌ది. ప‌శ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మ‌ధ్య నువ్వా నేనా అన్న పోటీ న‌డుస్తున్న‌ది.

బిహార్‌లో సీఎం నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ 13 సీట్లలో లీడ్‌లో ఉండగా, బీజేపీ 11 చోట్ల, లోక్‌జనశక్తి 5 చోట్ల తిరుగులేని ఆధిక్యంలో దూసుకుపోతున్నాయి. ఇక ఇండియా కూటమిలోని ఆర్జేడీ 4, సీపీఐఎంఎల్‌ 2, సీపీఐ, కాంగ్రెస్‌, హెఏఎంఎస్‌ ఒక్కో చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇతరులు 2 సీట్లలో లీడ్‌లో ఉన్నారు.

Also Read:ఓటమి బాటలో ఏపీ మంత్రులు..

- Advertisement -