టార్గెట్ 2024.. ‘కూటమి’ల స్ట్రాటజీలు!

59
- Advertisement -

2024 పార్లమెంట్ ఎన్నికలకు ఎంతో సమయం లేదు. మరో మూడు నెలల్లో ఆ ఎన్నికల నగార కూడా మోగనుంది. ఈసారి కేంద్రంలో అధికారం కోసం ఎన్డీయే కూటమి తో పాటు ఇండియా కూటమి కూడా గట్టిగానే పోటీ పడుతోంది. 2014 నుంచి మోడీ మేనియా కారణంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారం సాధిస్తూ వచ్చింది. ఈసారి మాత్రం ఎన్డీయేకు చెక్ పెట్టి అధికార మార్పు చేయాలని కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే గతంలోని యూపీఏ కూటమిని రద్దు చేసి ఆ స్థానంలో సరికొత్తగా ఇండియా కూటమిని ప్రవేశ పెట్టింది. బీజేపీ యేతర పార్టీలను పోగు చేసి ఇండియా కూటమిగా మార్చిన కాంగ్రెస్ ఈసారి అధికారం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఇండియా కూటమిని మరింత బలపరిచేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. .

ప్రస్తుతం ఇండియా కూటమిలో 28 పార్టీలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. వీటి సంఖ్య వీలైనంత ఎక్కువ పెంచే ఆలోచనలో ఇండియా కూటమి అగ్రనేతలు ఉన్నట్లు సమాచారం. అటు ఎన్డీయే కూటమి కూడా ఇదే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్డీయే కూటమిలో 38 పార్టీలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఇక ఈ రెండు కూటమిలతో సంబంధం లేకుండా చాలా ప్రాంతీయ పార్టీలే ఉన్నాయి. వాటిపైనే ఇరు కూటమిల ఫోకస్ పడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం సౌత్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగు దేశం పార్టీ, భారత రాష్ట్ర సమితి.. వంటి పార్టీలు ఏ కూటమిలోనూ సభ్యత్వం లేవు. అలాగే నార్త్ లో బిఎస్పీ, సిపిఎం, ఎన్పిపి వంటి చాలా పార్టీలు ఇండిపెండెంట్ గానే ఉన్నాయి. దాంతో వీటిని తమ కూటమిలలో కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఇండియా, ఎన్డీయే కూటమిల నేతలు. ఎన్నికల సమయానికి వీలైనన్ని పార్టీలను కూటమిలో మమేకం చేసే దిశగానే వ్యూహాలు రచిస్తున్నారు. దాంతో టార్గెట్ 2024 దిశగా కూటమిల స్ట్రాటజీలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

Also Read:Bigg Boss 7 Telugu:అమర్‌ని దొంగ చేసేశారు

- Advertisement -