ఇండియా కూటమి నేతలు దేశ రాజధాని ఢిల్లీలో సమావేశం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు రాహుల్, సోనియా గాంధీతో పాటు వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు.
సీపీఐ ( జాతీయ కార్యదర్శి డీ రాజా, సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి,సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్‌పవార్, ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, డీఎంకే నేత టీఆర్ బాలు, ఆర్జేడీ నేతలు తేజస్వియాదవ్, సంజయ్ యాదవ్, జేఎంఎం నేతలు చంపాయ్ సోరెన్, కల్పనా సోరెన్ ఉన్నారు. ఉద్ధవ్ బాల్ థాకరే (UBT) శివసేన నాయకుడు అనిల్ దేశాయ్, సీపీఐ ఎంఎల్ (CPI (ML)) పార్టీ నేత దీపాంకర్ భట్టాచార్య తదితరులు హాజరు కాగా ఎన్నికల ఫలితాల అనంతరం తీసుకోవాల్సిన ఎజెండాపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read:కాంగ్రెస్,బీజేపీ మధ్యే పోటీ:కోమటిరెడ్డి