పాడవోయి భారతీయుడా!

55
- Advertisement -

ఎందరో మహానుభావులు..తమ అసమాన పోరాటంతో దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో చిరస్ధాయిగా నిలిచిపోయారు. పర పీడనలో నలిగిపోతున్న భారతదేశ పోరాటంలో అహింసా పద్ధతిలో కొంతమంది పోరాడితే, మరికొంతమంది వీరయోధులు విప్లవ భావాలను ప్రచారం చేసి ప్రజల్లో చైతన్యం నింపి ఏకతాటిపైకి తెచ్చారు. దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి తమ దేశభక్తిని చాటుకున్నారు. ఎందరో త్యాగమూర్తుల ప్రాణ త్యాగాలు, వీర మరణాలతో ఆసేతు హిమాచలం నిరంకుశ బ్రిటిష్‌ ప్రభుత్వం నుంచి విముక్తి పొంది స్వేచ్ఛా భారతం ఆవిర్భవించింది.

స్వతంత్య్రం వచ్చాక వీర యోధులు చేసిన పోరాటాలపై ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ప్రజల్లో దేశ భక్తిని పెంపొందించేందుకు దోహదం చేస్తున్నాయి. కొన్ని సినిమాలు ఇప్పటికి, ఎప్పటికి ఎవర్‌గ్రీన్ సినిమాలే కాగా కొన్ని పాటలైతే మధుర జ్ఞాపకాలే.

భారత స్వాతంత్య్ర గాథ కథావస్తువుగా తీసుకుని నటి, గాయని కృష్ణవేణి నిర్మించిన ‘మన దేశం’,‘మరో ప్రపంచం’ ఎవర్ గ్రీన్ చిత్రాలు. లెండు భారతీయులారా.. నిదుర లేవండోయ్, కల్లు మానండోయ్ బాబు- కళ్ళు తెరవండోయ్ అంటూ తాగుడుపై శంఖారావం పూరించారు సముద్రాల.

Also Read:Whatsapp:అదిరే ఫీచర్

ఏ దేశమెగినా ఎందుకాలిడినా..పొగడరా నీ తల్లి భూమి భారతిని/ నిలుపరా నీ జాతి నిండు గౌరవము అనే పాట అందరి మదిలో ఎప్పటికి గుర్తుండిపోతుంది. బడిపంతులు సినిమాలో భారతమాతకు జేజేలు/ బంగరు తల్లికి జేజేలు అనే పాట అలాగే ‘పాడవోయి భారతీయుడా/ స్వాతంత్య్రం వచ్చెనని సభలే చేసి/ సంబరపడగానే సరిపోదోయ్/ సాధించిన దానికి సంతృప్తిని చెంది/ అదే విజయమనుకొనుటే పొరపాటోయ్ అని ప్రశ్నించేతత్వాన్ని ప్రజల్లో తట్టిలేపింది.

1971లో దేశంలో ఉన్న పరిస్థితి నేపథ్యంలో గాంధీ పుట్టిన దేశమా ఇది. నెహ్రూ కోరిన సంఘమా ఇది. రామరాజ్యం సామ్యవాదం సంభవించే కాలమా అంటూ సాగిన పాట మహాద్భుతం. మా తెలుగుతల్లికి మల్లెపూదండ…మా తన్నతల్లికి మంగళ హారతులు, చెయ్యెత్తిజైకొట్టు తెలుగోడా- గతమెంతో ఘనకీర్తి గలవోడా ఇప్పటికి వింటుంటే మనస్సు ఎంతో హాయిగా ఉంటుంది.

Also Read:TTD:దళిత గోవిందం

- Advertisement -