Independence Day:బాలీవుడ్‌కి ధీటుగా టాలీవుడ్

44
- Advertisement -

76 ఏళ్ళ స్వాతంత్య్ర ఫలాలను అనుభవిస్తున్నాం. భారతదేశం ఇప్పుడు ప్రపంచదేశాలకు ఓ దిక్సూచి. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతూ ముందుకుసాగుతున్నాం. ఇక ప్రపంచంలో భారతీయ చిత్ర పరిశ్రమకు ఉన్న గుర్తింపు ప్రత్యేకం. హాలీవుడ్ తర్వాత ఆ రేంజ్ లో ఎక్కువ సినిమాలు విడుదల చేసేది, అంత రెవిన్యూ జనరేట్ చేసేది భారత సినీ పరిశ్రమేనంటే అతిశయోక్తి కాదు. భారత సినీ పరిశ్రమలో ఒక్కో భాషకి ఒక్కో సినీ పరిశ్రమ ఉంది.

ఈ 76 ఏళ్లలో దేశ భక్తిని చాటి చెప్పే ఏన్నో చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తెలుగులో దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలను పరిశీలిస్తే అజరామరం. ఇక తొలుత ఆల్ టైం హిట్ సినిమాల్లో ఒకటిగా ఎప్పటికి నిలిచిపోయేది అల్లూరి సీతారామరాజు. తొలుత ఎన్టీఆర్ ఈ సబ్జెక్ట్‌ను తెరపై ఆవిష్కరిద్దామనున్నా అది సాధ్యపడలేదు. కానీ సూపర్ స్టార్ కృష్ణ దానిని సుసాధ్యం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. మన్యం వీరుడు అల్లూరి కథతో తెరకెక్కిన ఈ చిత్రం దేశభక్తిని ఉప్పొంగేలా చేసింది.

కృష్ణవంశీ దర్శకత్వంలో దేశభక్తి కథాంశంతో వచ్చిన సినిమా ‘ఖడ్గం’. 1990లో ముంబైలో జరిగిన దాడుల్లో చాలా మంది చనిపోయారు. దాని ఆధారంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించాడు కృష్ణవంశీ. శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్, రవితేజ ప్రధాన పాత్రల్లో నటించిన ఇప్పటికి ఎవర్‌గ్రీన్ సినిమానే.

Also Read:కాళేశ్వరం క్రెడిట్.. ఎవరిది?

కమల్ హాసన్ – శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఆల్‌టైం క్లాసిక్ హిట్ మూవీ భారతీయుడు. దేశభక్తి ప్రధాన నేపథ్యంగా అవినీతిని రూపుమాపే పోరాట యోధుడిగా కమల్ చేసిన సాహసం అద్భుతం. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ ఇండియన్ 2 కూడా తెరకెక్కుతోంది.

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా తెరకెక్కించిన చిత్రం ‘సైరా’. మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో నటించారు. కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ ప్రాంతంలో జన్మించిన నరసింహారెడ్డి దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి పడిన కష్టాన్ని ఈ సినిమాలో కళ్ల కట్టినట్లు చూపించారు.

ఇక దేశభక్తిని పెంపోందించడంలో ఎన్టీఆర్ చేసిన చిత్రాలు సూపర్ హిటే. సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి. ఈ రెండు సినిమాలు అశేష ప్రేక్షకాదరణ పొందాయి. ఈ రెండు ఈ సినిమాలకు దాసరి నారాయణరావే దర్శకత్వం వహించారు. 2009 లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మహాత్మ. గాంధీ చేసిన పోరాటం నేపథ్యంగా తెరకెక్కగా శ్రీకాంత్, భావన ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలోని కొంతమంది ఇంటిపేరు కాదుర గాంధీ పాట సూపర్ హిట్.

Also Read:షర్మిల కండిషన్స్.. పాలేరు కోసమే?

వీటితో పాటు వందేమాతరం, స్టాలిన్, ఠాగూర్, ఘాజీ, కొమరం పులి, సుభాష్ చంద్రబోస్, పరమవీర చక్ర, మేజర్ చంద్రకాంత్, ఆంధ్ర కేసరి, జై, నేటి భారతం, ఇలా ఎన్నో తెలుగు చిత్రాలు దేశభక్తిని చాటాయి.

- Advertisement -