పోలీసు పురస్కారాలు ప్రకటించిన కేంద్రం..

56
Police Medals announced

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన వివిధ దళాలు, రాష్ట్రాల పోలీసులకు పురస్కారాల ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇన్స్‌పెక్టర్ జనరల్ శివశంకర్ రెడ్డి, హైదరాబాద్ అడిషనల్ సిపి షికా గోయెల్ లకు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ పురస్కారాలు.

కేంద్రం ప్రకటించిన పోలీస్ ప్రతిభా పురస్కారాలు ఇవే..

-రాజేష్ కుమార్, ఐజీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ హైదరాబాద్.
-షరీఫుద్దీన్ సిద్ధికి, కమాండేట్, టిఎస్ఎస్ఎస్పి బెటాలియన్ హైదరాబాద్.
-కందుకూరి నర్సింగరావు, డిఎస్పీ నిర్మల్.
-సూర్యనారాయణ, డిఎస్పీ, ఎసిబి రంగారెడ్డి.
-గోవర్ధన్ తన్నీరు, ఏసీపీ హైదరాబాద్.
-గుంజ రమేష్, డిప్యూటీ అసల్ట్ కమాండర్, గ్రే హౌండ్స్.
-ఎమ్. ఉద్ధవ్, కానిస్టేబుల్, టిఎస్ఎస్ఎస్పి 13బెటాలియన్ మంచిర్యాల.
-బి. గోవర్ధన్, ఎస్సై ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్.
-కె. కరుణాకర్ రెడ్డి, ఏఎస్సై, సీసీఎస్ రాచకొండ.
-బి. మోహన్ రాజు, ఏఆర్ ఏఎస్సై, 13బెటాలియన్, మంచిర్యాల.
-డి, మోహన్ రెడ్డి, కానిస్టేబుల్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్.
-ఎండి నయిముద్దీన్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్.