Ind Vs WI:భారత్ 438 ఆలౌట్

69
- Advertisement -

విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ భారీ స్కోరు సాధించింది. రెండో రోజు ఫస్ట్ సెషన్‌లోనే విరాట్ కోహ్లీ సెంచరీ సాధించగా రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీతో రాణించారు. అయితే వీరిద్దరూ త్వరగానే ఔటయ్యారు. విరాట్ 121 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టగా జడేజా 61 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. అయితే తర్వాత వచ్చిన అశ్విన్ 56 పరుగులు చేసి రాణించడంతో భారత్ 438 పరుగులకు ఆలౌట్ అయింది.

విండీస్ బౌలర్లలో రోచ్ 3,గ్యాబ్రెల్ 1,వాక్రెన్ 3,హోల్డర్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ మాత్రమే కొల్పోయి 86 పరుగులు చేసింది. బ్రాత్ వైట్ 37 పరుగులతో క్రీజులో ఉండగా చందర్‌పాల్ 33 పరుగులు చేసి ఔటయ్యారు.

తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 288/4గా ఉన్న సంగతి తెలిసిందే.

Also Read:ప్రతిరోజూ ఇవి తింటే ఎన్ని ప్రయోజనాలో..!

- Advertisement -