భారత్ – వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు డ్రాగా ముగిసింది. భారత్ గెలుపు ఖాయమనుకున్న తరుణంలో వరణుడి రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. ఒక్క బాల్ పడకుండానే ఆట రద్దైంది. విరామం లేని వర్షంతో క్వీన్స్‌పార్క్ ఓవల్ తడిసి ముద్దయ్యింది. దీంతో అంపైర్లు ఆటను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను రోహిత్‌సేన 1-0తో దక్కించుకుంది.
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 438 పరుగులు చేయగా విండీస్ 255 పరుగులకు ఆలౌటైంది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా టీ20 తరహాలో దంచికొట్టడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. 181/2 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన రోహిత్.. ప్రత్యర్థి ముందు 365 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించాడు. భారీ ఛేదనలో విండీస్ నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. సిరాజ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.
Also Read:Guava:జామకాయతో ఎన్ని ఉపయోగాలో