TTD:ఆగస్టులో కార్యక్రమాలివే

28
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనం కోసం 20 కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచి ఉండగా సర్వ దర్శనం టోకెన్లు ఉన్న భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ఆదివారం 87,792 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 29,656 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

ఆగస్టులో స్వామివారి విశేష ఉత్సవాల సందర్భంగా భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆగస్టులో టీటీడీకి సంబంధించిన కార్యక్రమాల లిస్టును రిలీజ్ చేశారు.

ఆగస్టు 1వ తేదీన పౌర్ణమి గరుడ సేవతో ఈ ఉత్సవాలు ఆరంభమౌతాయి. పౌర్ణమి గరుడ సేవ సందర్భంగా ఉత్సవ మూర్తులను తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు. 31వ తేదీన హయగ్రీవ జయంతి, తిరుమల శ్రీవారు శ్రీ విఖనసాచార్య స్వామి సన్నిధికి వేంచేపుతో ముగుస్తాయి. ఆగస్టు 12వ తేదీన మతత్రయ ఏకాదశి ఉత్సవాలను సంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తారు టీటీడీ అధికారులు.

ఆగస్టు 15వ తేదీన చక్రత్తాళ్వార్ వర్షతిరునక్షత్రం, ప్రతివాది భయంకర అణ్ణంగరాచార్య వర్ష తిరునక్షత్రం వేడుకలను షెడ్యూల్ చేశారు. ఆగస్టు 21వ తేదీన గరుడ పంచమి. దీన్ని పురస్కరించుకుని శ్రీవారికి పంచమి గరుడ సేవను నిర్వహిస్తారు.

Also Read:CM KCR:ప్రభుత్వ ఉద్యోగులుగా వీఆర్‌ఏలు

22వ తేదీన కల్కి జయంతి సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక సేవలను నిర్వహిస్తారు. 25వ తేదీన తరిగొండ వెంగమాంబ వర్ధంతి. అదే రోజున వరలక్ష్మీ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తారు. ఆగస్టు 26వ తేదీన తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ ఉంటుంది. 27 నుంచి 29వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలను జరుపుతారు.

30వ తేదీన విఖనస మహాముని జయంతి. అదే రోజున శ్రావణపౌర్ణమి వేడుకలను ఘనంగా జరుపుతారు. 31వ తేదీన హయగ్రీవ జయంతి. తిరుమల శ్రీవారు శ్రీ విఖనసాచార్య స్వామి సన్నిధికి వేంచేపుతో ఈ విశేష ఉత్సవాలు ముగుస్తాయి.

Also Read:బీఆర్ఎస్‌లో చేరిన కుంభం అనిల్ రెడ్డి..

- Advertisement -