IND vs ENG : భారీ ఆధిక్యంలో భారత్ !

37
- Advertisement -

టీమిండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ లో రోహిత్ సేన భారీ ఆధిక్యం సాధించే దిశగా సాగుతోంది. రెండో రోజు ఆటముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 473 పరుగులు సాధించింది. మొత్తం మీద 255 పరుగుల ఆధిక్యంలో టీమిండియా కొనసాగుతోంది. దీంతో చివరి టెస్టులో కూడా రోహిత్ సేన పట్టు బిగించినట్లేనని చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు. ఓవర్ నైట్ ఆటలో వికెట్ కోల్పోయి 135 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా రోహిత్ (103), గిల్ (110) సెంచరీలతో చెలరేగడంతో భారీ స్కోరు సాధించింది.

వీరితో పాటు యంగ్ ప్లేయర్ సర్ఫరాజ్ ఖాన్ తన వంతుగా (56) హాఫ్ సెంచరీతో రాణించగా, కొత్తగా అరంగేట్రం చేసిన పడిక్కల్ (65) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇక మిగిలిన ప్లేయర్స్ ఎవరు పెద్దగా రాణించలేదు. ప్రస్తుతం క్రీజ్ లో కుల్దిప్ (27), దృవ్ జూరెల్ (15) ఉన్నారు. వీరిద్దరు మరో 50 పరుగులు జోడించిన టీమిండియాకు 300 పరుగుల ఆధిక్యం లభిస్తుంది. ప్రస్తుతం పటిష్టంగా ఉన్న టీమిండియా ఎన్ని పరుగుల చేస్తే ప్రత్యర్థి జట్టుపై అంతా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అంతకు ముందు తొలిరోజు ఆటలో ఇంగ్లీష్ జట్టు 218 పరుగుల వద్ద ఆలౌటైంది. కుల్దిప్ (5/72), అశ్విన్ (4/51) వికెట్లు తీసి ఇంగ్లాండ్ నడ్డి విరిచారు. ప్రస్తుతం భారీ ఆధిక్యంలో ఉన్న టీమిండియాను ఓడించడం ఇంగ్లాండ్ కు అంత తేలికైన విషయం కాదు. దీన్ని బట్టి చూస్తే చివరి టెస్టులో కూడా టీమిండియా విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆరంగేట్రంలో అద్భుత ఇన్నింగ్స్

ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో జట్టులో ఎంట్రీ ఇచ్చిన సర్ఫరాజ్ ఖాన్ అంచనాలకు మించి రాణిస్తున్నాడు. వరుసగా మూడో టెస్టులోనూ, నాలుగో టెస్టులోను హాఫ్ సెంచరీతో రాణించిన సర్ఫరాజ్, ఐదో టెస్టులో కూడా హాఫ్ సెంచరీతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇక పడిక్కల్ కూడా ఆరంగేట్ర మ్యాచ్ తోనే హాఫ్ సెంచరీ చేసి సత్తా చాటాడు. మొత్తానికి ఆరంగేట్ర మ్యాచ్ తోనే రాణిస్తున్న యంగ్ ప్లేయర్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

Also Read:ఇందిరమ్మ ఇల్లు.. ఇదేం ఫిటింగూ?

- Advertisement -