Ind vs Aus T20 :రికార్డ్ బ్రేక్.. ఉతికేశారు!

39
- Advertisement -

టీమిండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో భారత్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. మొదటి మ్యాచ్ లో భారీ స్కోర్ ను ఛేదించి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న టీమిండియా రెండో మ్యాచ్ లో కూడా అదే స్థాయిలో విజయాన్ని నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. యశస్వి జైస్వాల్ 25 బంతుల్లో 53 పరుగులు, ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 52 పరుగులు, రుతురాజ్ గైక్వాడ్ 43 బంతుల్లో 58 పరుగులు చేసి విధ్వంసం సృష్టించారు. టీ20 క్రికెట్ హిస్టరీలోనే భారత్ తరపున టాపార్డర్ బ్యాట్స్ మెన్ 50 పైగా వ్యక్తిగత స్కోర్ చేయడం ఇదే మొదటిసారి..

సీనియర్ ప్లేయర్స్ కూడా సాధ్యం కానీ ఈ ఫీట్ ను కుర్రాళ్ళు సాధించడం విశేషం. ఇక టీమిండియా నిర్ధేశించిన 235 పరుగుల లక్ష్య చేధనలో ఆసీస్ బ్యాట్స్ మెన్స్ 191 పరుగులకే పరిమితమైంది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్స్ లో స్టోయినిస్ ( 45 ), మాథ్యూ వేడ్ ( 42 ), టిమ్ డేవిడ్ ( 37 ) పరుగులతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేసిన లక్ష్యం పెద్దది కావడంతో ఆస్ట్రేలియా జట్టు చేతులెత్తేసింది. ఈ విజయంతో భారత్ 2-0 ఆధిక్యంతో ముందంజలో ఉంది. ఇక 28 న జరిగే మూడో టీ20 మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. ఆ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తుంటే.. ఎలాగైనా ఆ మ్యాచ్ గెలిచి సిరీస్ లో నిలవాలని ఆసీస్ జట్టు ప్రయత్నించే అవకాశం ఉంది. మరి టీమిండియా ఇదే దూకుడు కొనసాగిస్తుందా లేదా ఆసీస్ పుంజుకుంటుందా అనేది చూడాలి.

Also Read:తమలపాకుతో.. జుట్టు స్ట్రాంగ్!

- Advertisement -