ఆసీస్ డేంజర్ గురూ.. జాగ్రత్త !

22
- Advertisement -

వన్డే వరల్డ్ కప్పుకు ముందు ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 22 న మొహాలీ వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరు దేశాలు తమ జట్లను ప్రకటించాయి కూడా. అసెస్ జట్టు ఒకే టీంతో బరిలోకి దుగుతుంటే.. టీమిండియా మాత్రం రెండు టీం లతో బరిలోకి డిగనున్నారు. కే‌ఎల్ రాహుల్ సారథ్యంలో మొదటి రెండు వన్డేలు, రోహిత్ శర్మ సారథ్యంలో మూడో వన్డేతో బరిలోకి డిగనున్నారు. మెగా టోర్నీకి మూడు జరుగుతున్నా సిరీస్ కావడంతో ఇరు జట్లు కూడా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. బలాబలాల విషయానికొస్తే.. బౌలింగ్ లోనూ బ్యాటింగ్ లోనూ టీమిండియా ఆసీస్ జట్లు అత్యంత పరిష్టంగా ఉన్నాయి. .

దాంతో పోరు నువ్వా నేనా అన్నట్లు సాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ సిరీస్ గెలిచిన జట్టు ఐసీసీ వన్డే ర్యాంకింగ్ లో మొదటి స్థానంలో నిలిచే అవకాశం ఉంది. దాంతో వరల్డ్ కప్ కు ముందు అగ్రస్థానం కోసం టాఫ్ ఫైట్ తప్పదని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆసియా కప్పు గెలిచిన భారత్.. ఆస్ట్రేలియా విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్ లను తమవైపు తిప్పుకునే సత్తా ఆసీస్ జట్టుకు ఉంది.

దానికి తోడు ఆ జట్టులో చివరి ప్లేయర్ వరకు బ్యాటింగ్ చేసే సత్తా ఉంటుంది. అందుకే ఆసీస్ విషయంలో బి కేర్ ఫుల్ అంటున్నారు క్రీడా విశ్లేషకులు. ముఖ్యంగా జట్టులో అత్యంత ప్రమాదకరమైన ఆటగాళ్లు.. గ్లెన్ మాక్స్ వెల్, కెమెరాన్ గ్రీన్, కెప్టెన్ కమిన్స్, మిచెల్ మార్స్, డేవిడ్ వార్నర్ వంటి ఫల్లు ఫామ్ తో సంబంధం లేకుండా గ్రాండ్ లో సంచలనలు సృష్టించగలరు. వారు ఏ మాత్రం చెలరేగిన టీమిండియాకు తిప్పలు తప్పవు కాబట్టి భారత బౌలర్స్ ఇంకా మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. ఆసియా కప్ తో ఫుల్ ఫామ్ లోకి వచ్చిన మహ్మద్ సిరాజ్, బుమ్రా, కుల్దిప్ వంటి వారు.. తమ ఫామ్ ను ఇలాగే కంటిన్యూ చేస్తే టీమిండియాకు తిరుగుండదు.

Also Read:వామ్మో..రక్తపోటుతో కిడ్నీ సమస్యలు!

- Advertisement -