IND vs AFG : పసికూనే.. కానీ ప్రమాదమే?

26
- Advertisement -

టీమిండియా మరో ఆసక్తికరమైన పోరుకు సిద్దమైంది. ఇటీవల సౌతాఫ్రికా టూర్ ముగించుకొని వచ్చిన టీమిండియా స్వదేశంలో అఫ్గానిస్తాన్ ను ఎదుర్కొనేందుకు సిద్దమైంది. అఫ్గానిస్తాన్ తో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ అడనుంది టీమిండియా. అందులో భాగంగానే నేడు తొలి మ్యాచ్ జరగనుంది. టీ20 వరల్డ్ కప్ కు ముందు జరుగుతున్న చివరి అంతర్జాతీయ సిరీస్ కావడంతో ఈ సిరీస్ లో విజయం సాధించి ఆత్మవిశ్వాసాన్ని కూదాటగట్టుకోవాలని భారత్ భావిస్తోంది. అటు అఫ్గాన్ జట్టు కూడా సిరీస్ పై అంతే పట్టుదలగా ఉంది. అఫ్గానిస్తాన్ జట్టు ను ఏ మాత్రం తక్కువగా అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎందుకంటే వన్డే వరల్డ్ కప్ లో ఆ జట్టు సాధించిన సంచలన విజయాలు అందరినీ ఆశ్చర్య పరిచాయి. ఇంగ్లాండ్, శ్రీలంక, పాకిస్తాన్ వంటి జట్లను మట్టి కరిపించింది. అందువల్ల అఫ్గాన్ పసికూన పసికూన కాదని చెబుతున్నారు క్రికెట్ నిపుణులు. ఇక జట్టు విషయానికొస్తే అఫ్గాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ ఫిట్ నెస్ కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అయినప్పటికి మరో ఆటగాడు ముజీబ్ తో టీమిండియాకు ప్రమాదమే. ఇక భారత్ విషయానికొస్తే.. టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల తొలి మ్యాచ్ కు దూరమైనట్లు తెలుస్తోంది.

దాంతో మూడో స్థానంలో తిలక్ వర్మ బరిలో దిగే అవకాశం ఉంది. ఇక తొలి మ్యాచ్ జరగనున్న మొహాలీ స్టేడియం పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉంది. దాంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేస్తే భారీ స్కోర్ నమోదయ్యే అవకాశం ఉంది. టీమిండియా టాప్ ఆర్డర్ లలో రోహిత్ శర్మ, జైస్వాల్, గిల్, తిలక్ వర్మ వంటి వారితో పటిష్టంగా ఉంది. మరి అఫ్గాన్ పై భారత్ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

తుది జట్టు అంచనా ; రోహిత్ శర్మ, జైస్వాల్, శుబ్ మన్ గిల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్, అక్షర్, అర్షదీప్, ఆవేష్ ఖాన్, కుల్దీప్ / రవి బిష్ణోయ్, ముఖేష్.

Also Read:ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్

- Advertisement -