బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 98 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్లో భాగంగా హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు ఇనయ సుల్తానా. తొలుత నామినేషన్స్‌లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చిన నాగ్.. తర్వాత ఇనయ ఎలిమినేట్ అయినట్లు తెలిపారు.
తర్వాత స్టేజి మీదకి వచ్చిన ఇనయ ఎమోషన్ అయింది. ఎలాగైనా కప్పు కొట్టాలనుకున్నాను, కానీ చివరి వరకు వచ్చి చివర్లో వెళ్లిపోవడం ఇంకా బాధగా ఉంది అని చెప్పింది. వెళ్లేముందు మిగిలిన కంటెస్టెంట్స్ గురించి చెప్పమన్నారు నాగ్.
శ్రీహన్ మంచివాడని చాలా లేట్ గా అర్థమైంది. అతను కప్పు కొట్టి రావాలి. ఆదిరెడ్డి నిజాయితీగా ఆడతాడు. శ్రీసత్య తనకి నచ్చినవాళ్ళ కోసం ఏదైనా చేస్తుంది, నచ్చకపోతే అవతలివాళ్ళని రెచ్చగొడుతుంది. కీర్తి ఎంతటి బాధని అయినా తట్టుకోగలదు. రోహిత్ చాలా డీసెంట్, తన శక్తిని బయట పెట్టట్లేదు, ఇక రేవంత్ అందరికి మంచి చెప్పాలని చూస్తాడు కానీ అది అవతలివాళ్ళకి నచ్చదు అని చెప్పింది. ఇక ఇనయా సుల్తానా వెళ్ళాక ఈ వారంలో బుధవారం మరో ఎలిమినేషన్ ఉంటుంది, ఇంకో కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు అని చెప్పారు నాగార్జున.
ఇవి కూడా చదవండి..