దొడ్డి కొమురయ్య స్పూర్తిని కొనసాగించాలి..

206
- Advertisement -

దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం గొప్పతనం కాదు దొడ్డి కొమురయ్య గారి స్ఫూర్తిని కొనసాగించినప్పుడే ఆయనకి నిజమైన నివాళి అన్నారు మంత్రి హరీష్ రావు. ఆలేరు పట్టణ కేంద్రం లో దొడ్డి కొమురయ్య కాంస్య విగ్రహావిష్కరణ చేశారు మంత్రి హరీష్. ఏపీ హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ కురుమ , ప్రభుత్వ విప్ గొంగిడి సునీత , టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు ఎడ్ల మల్లేశం , కురుమ సంఘం సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్‌..ఆలేరు నియోజకవర్గం లో ఎంతో స్ఫూర్తిని చూపిస్తూ దొడ్డి కొమురయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.తెలంగాణ సాయుధ పోరాటం భూమికోసం, భుక్తికోసం, విముక్తి పోరాట ఉద్యమంగా మారడానికి దొడ్డి కొమరయ్య అమరత్వమే ప్రధాన కారణం అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర అని తలుచుకోగానే మొదటగా స్ఫురణకు వచ్చే వ్యక్తి దొడ్డి కొమరయ్య అన్నారు.

దొడ్డి కొమురయ్య గారి పోరాట స్ఫూర్తితో నే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం….కురుమ కులస్తులైన రాములు సాంబశివుడు నమ్మిన ధర్మం కోసం చివరి వరకు పోరాటం చేశారు.ఏ కులంలో నైనా ఐక్యత, విద్య ఉండాలి. కురుమ కులస్తులు కూడా ఐక్యమత్యంగా ఉండి విద్యలో రాణించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కురుమ కులస్తులు పిల్లలను బాగా చదివించాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలో ఇంగ్లీషులో విద్యాబోధన అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఎక్కడైనా మీరు చదివించవచ్చు కానీ చదివించడం మాత్రం ముఖ్యం అన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -