ఏపీలోనూ రైతుబంధు, రైతుబీమాః జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి

279
ys jagan
- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైఎస్సార్ సిపి అధికారంలోకి వ‌స్తే తెలంగాణ ప్ర‌భుత్వం మాదిరి రైతుబంధు, రైతు బీమా ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తామ‌న్నారు వైసిపి అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. 3,648 కిలోమీటర్లు సాగిన‌ ప్ర‌జా చైత‌న్య యాత్ర నేటితో యుగియ‌డంతో ఇచ్చాపురంలో ఫైలాన్ ను ఆవిష్క‌రించారు. ఈసంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో జ‌గ‌న్ మాట్లాడుతూ.. అలాగే తెలంగాణ రైతులకు అందిస్తున్న రైతు బీమా మాదిరిగానే రైతులకు బీమా ప్రీమియం కూడా తమ ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు.

jagan

బీమా సొమ్మును రైతు కుటుంబాలకు చేర్చే బాధ్యత మా ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు. మే నెలలో ప్రతీ రైతుకు రూ.12,500 ఇస్తామని అలాగే రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతీ మండలంలోనూ కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్ర‌తి పార్ల‌మెంట్ ను ఓ జిల్లాగా మారుస్తామ‌ని హామి ఇచ్చారు. మొత్తం 25 జిల్లాల‌తో కొత్త ఆంధ్రప్ర‌దేశ్ ను నిర్మిస్తామ‌న్నారు. రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని స్ప‌ష్టం చేశారు. 14 నెల‌ల్లో ప్ర‌జ‌ల్లో తిరిగాన‌ని ఎ ఒక్క కుటుంబంలో కూడా చిరున‌వ్వు లేద‌న్నారు.

- Advertisement -