ధోని ట్రిపుల్‌ సెంచరీ !

184
In 300th ODI, MS Dhoni On The Verge Of Setting Two World Records
In 300th ODI, MS Dhoni On The Verge Of Setting Two World Records
- Advertisement -

మూడు వన్డేలు గెలిచి శ్రీలంకతో ఇప్పటికే వన్డే సిరీస్‌ గెలిచినా టీమిండియా నేడు నాలుగో వన్డేలో ఆడనుంది. అయితే ఈ వన్డే టీమిండియా మాజీ కెప్టెన్ , వికెట్ కీపర్, స్పెషలిస్టు బ్యాట్స్ మన్ ధోనీ ప్రత్యేకం కానుంది. ధోనీ నేటి వన్డేతో తన కెరీర్ లో 300 మ్యాచ్ లు ఆడిన వ్యక్తిగా రికార్డు పుటలకెక్కనున్నాడు. ఇప్పటికే ధోనీ ఖాతాలో లెక్కలేనన్ని రికార్డులు ఉన్న సంగతి తెలిసిందే. ధోనీ నేటి వన్డేతో రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పనున్నాడు. వికెట్ కీపర్ కు ఇది సుదీర్ఘ కెరీర్ కావడం విశేషం. అలాగే ధోనీ ఇప్పటి వరకు 99 స్టంపింగ్స్ చేసి సంగక్కరను అధిగమించాడు. మరొక్క స్టింపింగ్ చేస్తే మరో రికార్డు అతని ఖాతాలో చేరుతుంది. బ్యాటింగ్ సమయంలో ధోనీ నాటౌట్ గా ఉంటే…అత్యధిక మ్యాచ్ లలో నాటౌట్ గా నిలిచిన ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కుతాడు

చివరి రెండు వన్డేల్లో తన సూపర్ ఫినిషింగ్‌తో టీమ్‌ఇండియాను గట్టెక్కించిన ధోనీ.. అలాంటే ప్రదర్శనతోనే ఈ మ్యాచ్‌నూ చిరస్మరణీయం చేసుకోవాలని భావిస్తున్నాడు. వన్డే క్రికెట్లో సచిన్‌ తెందుల్కర్‌ (463), రాహుల్‌ ద్రవిడ్‌ (344), అజహరుద్దీన్‌ (334), సౌరభ్‌ గంగూలీ (311), యువరాజ్‌ సింగ్‌ (304) తర్వాత మూడొందల మ్యాచ్‌లు ఆడిన భారత ఆటగాడిగా ఘనత సాధించనున్నాడు ధోనీ. సిరీస్‌ ఇప్పటికే చేజిక్కిన నేపథ్యంలో భారత్‌.. ఇప్పటివరకు బెంచ్‌కే పరిమితమైన ఆటగాళ్లలో కొందరిని ఈ మ్యాచ్‌లో తీసుకునే అవకాశముంది.

- Advertisement -