భర్తలకు ఓ సందేశం.. వీడియో !

255
husband-sing-song-wife-police-station
husband-sing-song-wife-police-station
- Advertisement -

భార్యా భర్తల మధ్య సంబంధాలు చెడిపోవడానికి అవగాహన రాహిత్యం ప్రధాన కారణమని మానసిక నిపుణులు చెబుతారు. బార్య భర్తల సంబంధం చెడిపోయే స్థితికి వచ్చిందంటే జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవటం కారణం కావచ్చు.కొన్ని సందర్భాలలో పురుషుడికి గల అహం, సుఖ సంసారానికి అడ్డంకిగా మారతుంది. ఇది భార్యా భర్తల మధ్య సంబంధాలకు హాని చేస్తుంది. భర్త ఆదిక్యం ఎక్కువ అయినప్పుడు భార్య ఆత్మ గౌరవం దెబ్బ తింటుంది. అదే ఇద్దరీ మధ్య గొడవలకు దారితీస్తుంది. ఇది భార్యా భర్తల మధ్య పూడ్చలేనంతటి అఘాదాన్ని సృష్టిస్తుంది. ఇలా బార్య భర్తలను దూరం చేసేవి.. ఇలాంటి చిన్న చిన్న సమస్యలే. ఆ చిన్న సమస్యలే ఒక్కోసారి పోలీసు స్టేషన్‌ దాకా వెళతాయి. అక్కడ గొడవలు సర్ధుమణగపోతే, ఆ భార్య భర్తలు విడిగా ఉండడమే మంచిదని అనుకుంటారు.

ఇక‌.. ఇలాగే.. ఓ జంట కూడా బాగా గొడ‌వ ప‌డింది. విష‌యం పోలీస్ స్టేష‌న్ దాకా వెళ్లింది. భార్య విడాకుల వ‌ర‌కూ వెళ్లింది. భ‌ర్త‌కు ఏం చేయాలో అర్థం కావ‌ట్లేదు. ఇంటి గుట్టు బ‌య‌ట ర‌ట్ట‌వ‌డంతో త‌న భార్యను ఎలాగైనా ఓదార్చాల‌నుకున్నాడు.. శాంతింప‌జేయాల‌నుకున్నాడు. అంతే.. అది పోలీస్ స్టేష‌న్ అని మ‌రిచి పోయి.. ఓ రొమాంటిక్ సాంగ్ అందుకున్నాడు.. పాట పాడి త‌న‌ను కూల్ చేశాడు. అంతే.. దెబ్బ‌కు భార్య వ‌చ్చి అత‌డి ఒడిలో వాలిపోయింది. క‌థ సుఖాంతం అయిపోయింది. భార్య‌ల‌తో గొడ‌వ ప‌డితే వ‌చ్చేదేమి లేదని తెలుసుకొని.. భార్యను తీసుకొని ఇంటికెళ్లిపోయాడు. ఇక‌.. దీనికి సంబంధించిన వీడియో మాత్రం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్న‌ది.

https://youtu.be/1vknqdbiGBU

- Advertisement -