ప్రజలు కోరితే రాజాకీయాల్లోకి వస్తా:కంగనా

164
- Advertisement -

నిత్యం వార్తల్లో నిలిచే బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ తాజాగా మరోసారి వార్తాల్లో నిలిచింది. తాను వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొంటానని వెల్లడించింది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించింది. ప్రజలు కోరితే రాజకీయాల్లోకి వస్తానని అన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజలు తనకు అవకాశం ఇస్తే వారి కోసం ఏరకంగా సేవలందించేందుకైనా తాను సిద్ధంగా ఉన్నానని ఓ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ ఆమె చెప్పుకొచ్చారు.

రానున్న హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇస్తున్న తప్పుడు హామీలను హిమాచల్‌ ప్రజలు విశ్వసించరని అన్నారు. అక్కడి ప్రజలకు సొంతంగా సోలార్‌ విద్యుత్‌ ఉందని, వారు తమ కూరగాయాలను తామే పండించుకుంటారని అన్నారు. హిమాచల్‌లో ఆప్‌ ఉచిత హామీలు ఆ పార్టీకి ఓట్లు రాలవని బాలీవుడ్‌ కంగనా రనౌత్‌ పేర్కొన్నారు.

కంగనా రనౌత్‌ ప్రస్తుతం ఎమర్జెన్సీ మూవీలో దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో అనుపమ్‌ ఖేర్‌, సతీష్‌ కౌశిక్‌, శ్రేయాస్‌ తల్పడె, మిలింద్‌ సొమన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

కర్ణాటక అసెంబ్లీకి యంగ్‌ టైగర్‌

బీజేపీకి ఓటు మునుగోడుకు చేటు

మంచి దొంగ.! దొంగిలిచ్చిన సొమ్ము తిరిగిచ్చేశాడు

- Advertisement -