పాకిస్తాన్ జట్టుపై తీవ్ర విమర్శలు చేశాడు ఆ జట్టు మాజీ ఆటగాడు, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. భారత్‌పై గెలవాలంటే ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్, పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీలను ఓపెనర్లుగా పంపాలని ఎద్దేవా చేశాడు.
ప్రస్తుతం జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్…ఈ పాక్ జట్టు భారత్‌పై గెలవాలంటే పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ, ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ ఓపెనర్లుగా బ్యాటింగ్‌కు రావాలి అని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
పాక్ గెలవాలంటే అంపైర్లుగా కూడా రాజకీయ, న్యాయ వ్యవస్థ పెద్దలు దిగాలంటూ వెటకారం చేశాడు. మాజీ పాక్ చీఫ్ జస్టిస్ ఖాజీ ఫైజ్ ఇసా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సికందర్ సుల్తాన్ రాజా ఆన్ – ఫీల్డ్ అంపైర్లుగా, ఇక ఇస్లామాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సర్ఫరాజ్ డోగర్ థర్డ్ అంపైర్‌గా ఉండాలన్నాడు. సూపర్ 4లో తొలి మ్యాచ్‌లో ఓడిన పాకిస్తాన్ సెప్టెంబర్ 23న శ్రీలంకతో తలపడనుంది.
Also Read:వెంకీ- త్రివిక్రమ్..షూటింగ్ అప్డేట్!

