వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ ఎప్పటికీ గుర్తుండిపోయే “నువ్వు నాకు నచ్చావ్”, “మల్లీశ్వరి” వంటి క్లాసిక్స్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఈ నటుడు–దర్శకుడి కాంబినేషన్ మళ్లీ వెంకటేష్ 77వ చిత్రానికి కలసి పనిచేయనున్నారు వీరిద్దరూ.
అయితే వెంకీతో త్రివిక్రమ్ రచయితగా పనిచేసినా, తొలిసారి వెంకీకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం వెంకీ77 అక్టోబర్ మొదటి వారంలో హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభంకానుంది.
మొదటి షెడ్యూల్ మొత్తం హైదరాబాద్‌లోనే జరగనుంది. ఈ చిత్రానికి హీరోయిన్‌గా కన్నడ యంగ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి పేరు వినిపిస్తోంది. కానీ దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. సీనియర్ నిర్మాత ఎస్. రాధాకృష్ణ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. నేషనల్ అవార్డు గెలుచుకున్న సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రమేశ్వర్ ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశం ఉంది.
Also Read:BB9:మనీష్ ఎలిమినేట్

