- Advertisement -
పాకిస్థాన్ నయా ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు షాకిచ్చే నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఇమ్రాన్, తన తొలి సమావేశంలోనే ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు.
నవాజ్ తో పాటు ఆయన కుమార్తె మరియంలు దేశం విడిచి వెళ్ళకుండా ఎగ్జిట్ కంట్రోల్ జాబితాలో పెట్టడంతో పాటు ఆయన కుమారులైన హుస్సాన్, హుస్సేన్ లను, మాజీ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ లను దేశం నుంచి పారిపోయిన నేరగాళ్లుగా పేర్కొంటూ, రెడ్ వారెంట్లను జారీ చేశారు. అయితే అవినీతి వ్యతిరేఖ చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాక్ సమాచార మంత్రి ఫవద్ చౌదరి వెల్లడించారు.
కాగా.. ప్రస్తుతం నవాజ్ కుమారులు లండన్ లో ఉండగా.. అక్కడ వారు కొనుగోలు చేసిన ఆస్తులపై నివేదిక ఇవ్వాలని బ్రిటన్ గవర్నమెంట్ ను పాకిస్థాన్ కోరాలని కూడా క్యాబినెట్ నిర్ణయించింది.
- Advertisement -