ఉద్యోగాల్లోకి ఎక్కువ మంది మహిళలు

3
- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడటంతో రాత్రి వేళల్లో వ్యాపార కార్యకలాపాలు పెరిగాయని, ఎక్కువ మంది మహిళలు ఉద్యోగాల్లో చేరేందుకు ముందుకొస్తున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.

ఈ మేరకు శుక్రవారం ఆయన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. రాత్రి సమయాల్లో వెలుగులతో కళకళలాడుతున్న మార్కెట్లు, వాణిజ్య సంస్థలు కేవలం వ్యాపార కార్యకలాపాలనే కాకుండా వ్యాపారుల్లో పెరిగిన ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు.

మహిళల భద్రతపై ప్రత్యేకంగా ప్రస్తావించిన యోగి.. రాత్రి షిఫ్టుల్లోనూ ఎలాంటి భయం లేకుండా తమ పని ప్రదేశాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళల ఆత్మవిశ్వాసం ప్రశంసనీయమని అన్నారు.

రాత్రి వేళల్లోనూ తమ పని ప్రదేశాల్లో నిర్భయంగా విధులు నిర్వహిస్తున్న మహిళల ఆత్మవిశ్వాసం వ్యక్తిగత విజయానికి మాత్రమే ప్రతీక కాదు. అది మొత్తం సమాజం సాధిస్తున్న అభివృద్ధికి చిహ్నం అని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో మెరుగైన శాంతిభద్రతల వల్ల మహిళలకు సురక్షితమైన వాతావరణం ఏర్పడటంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు కూడా ఊపందుకుంటున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read:సోనియా గాంధీకి CTI లేఖ

- Advertisement -