ఏటీఎం మోసాల ముఠా గుట్టురట్టు..

4
- Advertisement -

ఏటీఎంలను ట్యాంపరింగ్ చేస్తూ ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును జార్ఖండ్ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాకు చెందిన నలుగురు సభ్యులను రామ్‌గఢ్ జిల్లాలో అరెస్ట్ చేసినట్లు శుక్రవారం పోలీసులు వెల్లడించారు.

రామ్‌గఢ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ముకేశ్ కుమార్ లునాయత్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుల నుంచి 18 ఏటీఎం కార్డులతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు.

పత్రాతు సబ్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి ఏటీఎం మోసాలపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఏటీఎం యంత్రాలను ట్యాంపరింగ్ చేసి, ఇతరుల ఏటీఎం కార్డులను ఉపయోగించి అక్రమంగా నగదు విత్‌డ్రా చేస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఏటీఎం కేంద్రాల్లో నకిలీ హెల్ప్‌లైన్ నంబర్లను అతికించి వినియోగదారులను మోసం చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

నకిలీ హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేసిన వినియోగదారులతో ముఠా సభ్యులు బ్యాంకు అధికారులమంటూ మాట్లాడేవారు. వారి నుంచి ఏటీఎం కార్డు వివరాలు సేకరించి నగదును కాజేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద లభించిన 18 ఏటీఎం కార్డులు, నగదును స్వాధీనం చేసుకుని మరిన్ని వివరాలపై విచారణ కొనసాగిస్తున్నారు.

Also Read:సోనియా గాంధీకి CTI లేఖ

సూచన: ఏటీఎం కేంద్రాల్లో గుర్తుతెలియని హెల్ప్‌లైన్ నంబర్లను నమ్మవద్దని, కార్డు వివరాలు, పిన్ నంబర్లను ఎవరికీ వెల్లడించవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

- Advertisement -