మహిళ్లలో థైరాయిడ్..ఈ పరీక్షలు తప్పనిసరి!

6
- Advertisement -

మహిళల్లో కనిపించే అలసట, మూడ్ మార్పులు, చిరాకు, ఒత్తిడి వంటి లక్షణాలను చాలాసార్లు సాధారణంగా తీసుకుంటారు. కానీ ఇవి చాలా సందర్భాల్లో శరీరంలో ఉన్న ఆరోగ్య సమస్యలకు సంకేతాలు కావచ్చని నిపుణులు చెబుతున్నారు.

మహిళలకు అవసరమైన ముఖ్యమైన ఆరోగ్య పరీక్షలు

1. థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్
ఈ పరీక్షలో TSH, T3, T4 హార్మోన్ స్థాయిలను పరీక్షిస్తారు. ఇవి మెటాబాలిజం, శక్తి స్థాయిలను నియంత్రిస్తాయి. అసమతుల్యత ఉంటే అలసట, బరువు మార్పులు, మూడ్ మార్పులు కనిపించవచ్చు. దీనితో Hypothyroidism లేదా Hyperthyroidism వంటి సమస్యలను గుర్తించవచ్చు.

2. ఎస్ట్రాడియోల్ టెస్ట్
ఎస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలను తెలుసుకోవడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. మెన్స్ట్రువల్ సమస్యలు, ఫర్టిలిటీ సమస్యలు, మెనోపాజ్ లక్షణాలను గుర్తించడానికి సహాయపడుతుంది.

3. ప్రోలాక్టిన్ టెస్ట్
పిట్యూటరీ గ్రంథి ఉత్పత్తి చేసే ఈ హార్మోన్ అధికంగా ఉంటే మెన్స్ట్రువల్ సైకిల్ లో అంతరాయం, గర్భధారణ సమస్యలు రావచ్చు.

4. HbA1c టెస్ట్
ఇది మూడు నెలల సగటు రక్తంలో చక్కెర స్థాయిలను తెలియజేస్తుంది. దీని ద్వారా Diabetesను గుర్తించవచ్చు.

5. ఫెరిటిన్ టెస్ట్
శరీరంలో నిల్వ ఉన్న ఐరన్ పరిమాణాన్ని తెలియజేస్తుంది. తక్కువగా ఉంటే Anaemia మరియు తీవ్రమైన అలసట రావచ్చు.

6. ల్యూటినైజింగ్ హార్మోన్ (LH) టెస్ట్
ఫర్టిలిటీ, రీప్రొడక్టివ్ సమస్యలను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది.

Also Read:కాంగ్రెస్‌పై మోదీ తీవ్ర విమర్శలు

7. ఫాలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (FSH) టెస్ట్
మెన్స్ట్రువల్ సైకిల్ మరియు ఫర్టిలిటీ సమస్యలను అర్థం చేసుకోవడానికి ఈ పరీక్ష చేస్తారు.

8. బీటా hCG టెస్ట్
ఈ రక్త పరీక్ష ద్వారా గర్భధారణను నిర్ధారించవచ్చు.

అలసట, మూడ్ మార్పులు, అసమాన మెన్స్ట్రువల్ సైకిల్ వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -