BCCI:15న బీసీసీఐ నమన్ అవార్డ్స్

2
- Advertisement -

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించే BCCI Naman Awards 2026 కార్యక్రమం మార్చి 15న ఢిల్లీలో జరగనుంది. ఈ వేడుకలో భారత క్రికెట్‌కు విశేష సేవలు చేసిన పలువురు ఆటగాళ్లు, దిగ్గజాలను సత్కరించనున్నారు.

ఈ ఏడాది పురుషుల విభాగంలో ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌గా భారత వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్‌కు Polly Umrigar Award ప్రదానం చేయనున్నారు. 2024–25 సీజన్‌కు గాను ఆయన ఈ అవార్డును రెండోసారి అందుకోనున్నారు. మహిళల విభాగంలో ఇదే అవార్డును భారత స్టార్ బ్యాటర్ స్మృతి మందన ఐదోసారి అందుకోనున్నారు.

అలాగే భారత మాజీ క్రికెటర్లు రాహుల్‌ ద్రావిడ్ , రోజర్ బిన్నిలకు బీసీసీఐ అత్యున్నత గౌరవంగా భావించే Col. C. K. Nayudu Lifetime Achievement Award ప్రదానం చేయనున్నారు. భారత క్రికెట్‌కు వారు చేసిన అమూల్యమైన సేవలకు గాను ఈ పురస్కారం ఇవ్వనున్నారు.

భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌కు మహిళల విభాగంలో BCCI Lifetime Achievement Award అందజేయనున్నారు. మహిళా క్రికెట్ అభివృద్ధికి ఆమె చేసిన సేవలను గుర్తిస్తూ ఈ గౌరవం ఇవ్వబడుతోంది. అంతేకాకుండా ఈ వేడుకలో ఐసీసీ ట్రోఫీలు గెలిచిన భారత జట్లను కూడా ప్రత్యేకంగా సత్కరించనున్నారు. దేశీయ క్రికెట్‌లో ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లకు కూడా అవార్డులు అందజేయనున్నారు.

ALso Read:కాంగ్రెస్‌పై మోదీ తీవ్ర విమర్శలు

ఈ సీజన్‌లో దేశీయ టోర్నీల్లో నాలుగు ట్రోఫీలు గెలిచి, రెండు టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచిన ముంబై క్రికెట్ అసోసియేషన్‌ కూడా ప్రత్యేక అవార్డు అందుకోనుంది. ఈ కార్యక్రమం భారత క్రికెట్ ప్రపంచానికి మరో ముఖ్యమైన వేడుకగా నిలవనుంది.

- Advertisement -