- Advertisement -
నిన్నటి వరకు కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఈరోజు ఉదయం ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో వాయుగుండంగా కొనసాగుతోందని వాతావరణ కేంద్ర వెల్లడించింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణిస్తూ ట్రింకోమలికి (శ్రీలంక) తూర్పు-ఆగ్నేయం దిశలో సుమారు 710 కిమీ మరియు కన్యకుమారికి తూర్పు-ఆగ్నేయం దిశలో సుమారు 1120 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నది. ఇది రాబోయే 12 గంటలలో తీవ్ర వాయుయుగుండంగా మారే అవకాశం ఉంది. తదుపరి 24 గంటలలో ఇది తుఫానుగా మారి పశ్చిమ-వాయవ్య దిశలో ప్రయాణిస్తూ డిసెంబర్ 2 వ తేదీ సాయంత్రం శ్రీలంక తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు మరియు రాబోయే రెండు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
- Advertisement -