టీఆర్ఎస్‌కు నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక సంపూర్ణ మద్దతు..

42
Nai Brahmin Aikya Veedika

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సోమవారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌ను కలిసి సంపూర్ణ మద్దతు లేఖను ఆ వేదిక నాయకులు అందజేశారు. నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక అధ్యక్షుడు మహేంద్ర చంద్ర, అధ్యక్షుడు లింగం నేతృత్వంలో ప్రతినిధులు వినోద్ కుమార్‌తో సమావేశమయ్యారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయీ బ్రాహ్మణుల సెలూన్ లకు విద్యుత్ చార్జీలు మాఫీ చేయడం చారిత్రక విషయం అని వారు పేర్కొన్నారు. నాయీ బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయం అని వారు తెలిపారు. అన్ని వర్గాలకు అన్ని రకాలుగా ఆదుకుంటున్న సీఎం కేసీఆర్‌కు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అండగా నిలువడం తమ కనీస కర్తవ్యం అని నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక నాయకులు వెల్లడించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ నాయీ బ్రాహ్మణులకు ధన్యవాదాలు తెలిపారు.