నా ఆరోగ్యం బాగానే ఉంది.. అనుష్క

555
Anushka Shetty
- Advertisement -

టాలీవుడ్ బ్యూటీ అనుష్క శెట్టి ‘సై రా’ మూవీ షూటింగ్ సమయంలో గాయపడినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. ఇటీవల సినిమాలో ఓ కీలక సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో అనుష్క కాలికి గాయమైందని.. ఆమె నడవలేని స్థితిలో ఉందని.. కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందని రకరాలుగా వార్తలు వినిపించాయి. దీనిపై తాజాగా స్వీటీ సోషల్‌మీడియా ద్వారా స్పందించారు.

Anushka Shetty

‘నా ఆరోగ్యం బాగానే ఉంది. సియాటిల్‌లో ‘సైలెన్స్‌’ మూవీ చిత్రీకరణలో ఆనందంగా పాల్గొంటున్నాను. లవ్యూ ఆల్‌’ అని తెలిపింది స్వీటీ. మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో అనుష్క కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ పూర్తైంది. ప్రస్తుతం అనుష్క సైలెన్స్‌ అనే మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాధవన్‌ కథానాయడు. అమెరికాలోని సియాటిల్‌లో చిత్రీకరణ జరుగుతోంది.

- Advertisement -