వాటి కోసం ఇలియానా వెంపర్లాట

130
- Advertisement -

గోవా సుందరి ఇలియానా తెలుగు తెరపై తిరుగులేని అందాలను వెదజల్లింది. సన్నజాజి లాంటి సన్నని నడుముతో సౌత్ లో అందాల సాలిడ్ బొమ్మలా చలామణి అయింది. ముఖ్యంగా ఎక్స్ ఫోజింగ్ లో ఇలియానా ఇవ్వని ఫోజు లేదు. కసి చూపుల్లో ఇలియానా చూపించని వేరియేషన్ లేదు. గ్లామరస్ క్యారెక్టర్స్ దగ్గర నుంచి ఐటమ్ గర్ల్ వరకూ.. ఇలియానా అన్ని రకాల కమర్షియల్ పాత్రల్లో ఘాటు మెరుపుల గుమగుమలు అందించింది.

పాత్ర ఏదైనా అందం లోతుల్లో ఒదిగిపోవడం, కురాళ్ళ హృదయాల పై తనదైన ముద్ర వేయడం ఇలియానాకి మేకప్ తో పెట్టిన విద్య. తెలుగు గ్లామర్ ప్రపంచంలో ఎంతో కీర్తి ప్రతిష్టలతో పాటు కావాల్సినంత డబ్బు కూడా సంపాదించిన ఇలియానా… హిందీ పరిశ్రమ పై మోజుతో తెలుగు తెరను చిన్న చూపు చూసింది. దాంతో సౌత్ ఇండస్ట్రీకి ఇలియానా పూర్తిగా దూరం అయింది.

అయితే, గత కొంత కాలంగా బాలీవుడ్ ప్లాప్ వలయంలో మునిగిపోవడం, మరోపక్క సౌత్ ఇండస్ట్రీ గొప్పతనం ముందు బాలీవుడ్ తేలిపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకోవడంతో.. ఇలియానా కి అసలు తత్త్వం బోధపడింది. అందుకే.. మళ్ళీ తెలుగు సినిమాల అవకాశాలు కోసం ఇలియానా వెంపర్లాడుతుంది.

హీరోయిన్ ఛాన్స్ ల కోసం తెలుగు దర్శకుల వెంట పడుతుంది ఇలియానా. ఒక్క ఛాన్స్ ఇవ్వమని డైరక్టర్లను వేడుకుంటుంది. ఏ మిడ్ నైట్ పార్టీలో ఎవరైనా దర్శకుడు కనిపిస్తే.. డైరెక్ట్ గా ఓ వేషం ఇవ్వమని ఇలియానా మొహమాటం లేకుండా ఆగేస్తోందట. తాజాగా డైరెక్టర్ క్రిష్ ను ఛాన్స్ అడిగిందట.

ఇవి కూడా చదవండి…

మీడియాకి కొరటాల దూరమెందుకో ?

బాలయ్య చెప్పేశాడుగా

గ్లామర్ ఉంది చూపించడానికే కదా.. !

- Advertisement -