ఇలియానా కళాతృష్ణ‌ తగ్గలేదట

30
- Advertisement -

హీరోయిన్ ఇలియానా ప్రస్తుతం ఛాన్స్ ల కోసం సరికొత్త లుక్ లో మెరిసిపోతుంది. ఇప్పటికే నటిగా ఎంట్రీ ఇచ్చి దాదాపు ఇరవై ఏళ్ళు దాటింది. అయినా ఒక న‌టిగా త‌న ఆసక్తి ఇంకా తగ్గలేద‌ని అంటోంది ఇలియానా. ఈ మధ్య ఓ హిందీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ గోవా బ్యూటీ బాగానే ఆకట్టుకుంది. అయితే, ఇక నుంచి తన సినిమాల వేగం పెంచాలని ఇలియానా ఫిక్స్ అయింది. ఇందులో భాగంగా వ‌చ్చే ఏడాది ఎన్ని సినిమాలు చేయాలి, ఎలాంటి పాత్ర‌లు చేయాల‌నే అంశం మీదే త‌న దృష్టంతా ఉందంటూ ఇలియానా చెబుతుంది. ఇంకా ర‌క‌ర‌కాల పాత్ర‌లు చేయాలి, బోలెడ‌న్ని సినిమాలు చేయ‌డం త‌ప్ప త‌న‌కు మ‌రో ధ్యాస లేద‌ని ఇలియానా మొత్తానికి త‌నలో మిగిలిఉన్న కళాతృష్ణ‌ను బయట పెడుతుంది.

ఇలియానా దాదాపు ద‌శాబ్ద‌కాలం నుంచి సినిమా రంగంలో హీరోయిన్ గా ఉంది. కెరీర్ మొదట్లో ఆమెకు అంత గుర్తింపు రాలేదు. ఐతే, తెలుగులో హీరో రామ్ సరసన నటించిన దేవదాస్ చిత్రంతో ఇలియానా ద‌శ తిరిగింది. ఆ సినిమా త‌ర్వాత ఇలియానాకు వ‌ర‌స పెట్టి అవ‌కాశాలు వ‌చ్చాయి. ఇలియానా నుంచి వచ్చిన ఆ తర్వాత పోకిరి, కిక్ వంటి సినిమాలు కూడా బాగా ఆడ‌టంతో.. స్టార్ హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు ల‌భించాయి ఇలియానాకు.

దాదాపు సౌత్ లో అందరి స్టార్ ల‌తో న‌టించి తను కూడా స్టార్ అయిపోయింది ఇలియానా. స్టార్ హీరోయిన్ గా కొంత‌కాలం పాటు బిందాస్ గా కొన‌సాగింది ఇలియానా కెరీర్. అయితే త‌ర్వాతి కాలంలో ఇలియానా కెరీర్ మంద‌గ‌మ‌నంలో ప‌డింది. కొన్ని సినిమాల ఫ్లాపుల‌తో, అలాగే వయసు పెరగడంతో ఇలియానా ప్రభ మసకబారింది. ఇలాంటి నేప‌థ్యంలో ఇలియానా మళ్లీ సినిమాల పై ఆసక్తి చూపిస్తొంది. మరి ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -