ఆర్సీ15 చరణ్ పాత్ర ఎలా ఉంటుందంటే ?

23
- Advertisement -

రంగస్థలంలో రామ్ చరణ్ చెవిటివాడి పాత్రలో అలరించాడు. ఇప్పుడు మరో ప్రయోగాత్మక పాత్రకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

వర్తమానంలో కొడుకు పాత్రలో, ఫ్లాష్ బ్యాక్ లో తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో రామ్ చరణ్ పాత్ర సతమతమయ్యేలా ఉంటుంది. నత్తిగా మాట్లాడే ఈ క్యారెక్టర్ ని శంకర్ చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశాడని అంటున్నారు.

జై లవకుశలో ఎన్టీఆర్, లైగర్‌లో విజయ్ దేవరకొండ, ఎఫ్3లో వరుణ్ తేజ్ అలాంటి పాత్ర కోసం ప్రయత్నించారు. నత్తి పాత్రతో ఎన్టీయార్ ఒక్కడే మెప్పించాడు మిగతా రెండు పాత్రలు ఊహించినంత వర్కౌట్ అవ్వలేదు. ఎన్టీఆర్‌ తో కంపేర్ చేయడం ఇప్పుడు రామ్ చరణ్‌కి సవాలుగా మారింది. రాం చరణ్ శంకర్ మీదే పూర్తి భాద్యత పెట్టి ఈ కేరెక్టర్ చేస్తున్నాడు. క్లిక్ అయితే ఎన్టీఆర్ తర్వాత మళ్ళీ నత్తితో నటించి మెప్పించిందే చరణే అవుతాడు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -