బాహుబలి సెట్‌లో చైతు ‘యుద్దం శరణం’..

230
Naga Chaitanya's role in Yuddham Sharanam
- Advertisement -

ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలతో సూపర్ హిట్లు కొట్టిన నాగచైతన్య.. ఈ మధ్య కాలంలో చక్కగా రొమాంటిక్ కామెడీలూ చేస్తూ వచ్చాడు. ఇటీవల యుద్దం శరణం సినిమా ద్వారా మరోసారి డిఫరెంట్ సినిమాను ఎంచుకున్నాడు.ఈ సినిమా క్రిష్ణ ముత్తు దర్శకత్వంలో చేస్తున్నాడు నాగ చైతన్య. థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం లో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం నిర్మిస్తుంది. ఈ మూవీ హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని సమాచారం. అయితే ఈ సినిమా గురించి ఒ వార్త హల్‌ చల్‌ చేస్తుంది. అదేంటంటే..

Naga Chaitanya's role in Yuddham Sharanam

‘బాహుబలి’ సినిమా ప్రేక్షకుల హృదయాలకు బాగా హత్తుకుపోయింది. అందువలన ఆ తరువాత వచ్చిన కొన్ని సినిమాల్లో ఏదో ఒక సందర్భంలో ‘బాహుబలి’ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ‘మజ్ను’ సినిమాలో ‘బాహుబలి’ సినిమాకి గాను రాజమౌళి దగ్గర అసిస్టెంట్ గా నాని కనిపించాడు. అదే తరహాలో ‘యుద్ధం శరణం’ సినిమాలో ‘బాహుబలి’ సినిమాకి సంబంధించి ‘డ్రోన్’ కెమెరా ఆపరేటర్ గా నాగచైతన్య కనిపించనున్నాడట.

ఈ సినిమా ఇంట్రడక్షన్ సీన్ ‘బాహుబలి’ సెట్లోనే మొదలవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ ఐడియా రాజమౌళి తనయుడు కార్తికేయ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆయన ఈ సినిమాకి లైన్ ప్రొడ్యూసర్ గా పనిచేశాడు. వచ్చేనెల 8వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో విలన్ గా శ్రీకాంత్ కనిపించనున్నాడు.

- Advertisement -