కెరీర్ తొలినాళ్లలో మహేష్ బాబు ఎవరో కూడా తనకు తెలియదని టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా వెలుగొందిన ఇలియానా తెలిపింది. దక్షిణ ముంబైలో జరిగిన ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఇలియానా మాట్లాడుతూ, ఎయిర్ హోస్టెస్ కావాలన్నది తన చిన్ననాటి కల అని, ఎయిర్ హోస్టెస్ అయితే ఉచితంగా ప్రపంచాన్ని చుట్టేయొచ్చని భావించానని తెలిపింది. ఆ తరువాత ఫ్యాషన్ డిజైనింగ్ చెయ్యాలని భావించానని, కాలేజీ రోజుల్లో క్లాసెస్ జరుగుతున్నప్పుడు లాస్ట్ బెంచ్ లో కూర్చుని డిజైన్లు గీస్తూ కూర్చునేదానినని తెలిపింది.తర్వాత సైకాలజీ చదవాలనుకున్నా.
కానీ ఆ దేవుడు నాకోసం వేరే మార్గాన్ని కనుగొన్నాడు. అదే సినిమా రంగం. అలా 16 ఏళ్ల వయసులో చిత్ర పరిశ్రమకు వచ్చాను. తొలి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్నాను. ఆ తర్వాత మహేశ్‌తో ‘పోకిరి’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అసలు అప్పట్లో నాకు మహేశ్ అంటేనే తెలిసేది కాదు. అసలు సినిమా ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికే చాలా కాలం పట్టింది. అలా ఏళ్లు గడుస్తున్న కొద్ది నేను చేసే పనిపై గౌరవం, ప్రేమ పెరిగాయి’ అని చెప్పుకొచ్చింది ఇలియానా. ఇప్పుడు బాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది ఈ గోవా బ్యూటీ. ఆమె మరోసారి మహేశ్‌బాబుతో కలిసి నటించే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.