దయన్న గెలుపును నోట్ల కట్టలు అడ్డుకోలేవన్నారు మంత్రి హరీశ్ రావు. పాలకుర్తిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి ఎర్రబెల్లి దయాకర్ రావుకి మద్ధతుగా నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడిన హరీశ్..ఆపదలో ఆదుకున్న, తలలో నాలుకలా ఉండే దయాకర్ రావు గెలవాలా? ఓట్ల ముందట నోట్ల కట్టలు పట్టుకొచ్చిన అమెరికా ఎన్నారైలు గెలవాలా? అని ప్రశ్నించారు. కరనా సమయంలో దయన్న పోరాడిండు. నాతో కొట్లాడి స్పెషల్ కోటాలో మందులు తెచ్చుకుని ప్రజలను కాపాడుకున్నారని చెప్పారు. ప్రతీ గల్లీకి సీసీ రోడ్లు, ఇంటింటికీ మంచి నీళ్లు ఇచ్చిన వ్యక్తి దయాకర్ రావు అని..ఆపోజిట్ అభ్యర్ధి అమెరికాలో విల్లాలు గిఫ్ట్‌గా ఇచ్చి టిక్కెట్లు కొన్నరని కాంగ్రెసోళ్లే అంటున్నరన్నారు.
దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ స్పూర్తి నిండిన పాలకుర్తి ప్రజల ఆత్మగౌరవాన్ని ఎవరూ కొనలేరని..డబ్బులున్నయని కాంగ్రెసోళ్లకు అహంకారం. దాంతో లీడర్లను కొంటరు కానీ ప్రజలను కొనలేరన్నారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలు అని చెప్పి ఉన్నగోసి ఊడపీకిర్రు..నమ్మితే మోసపోతం, పాపమంటే గోస పడ్తం అన్నారు. కరెంట్ కావాలా?కాంగ్రెస్ కావాల్నా? కరెంట్ కావాలంటే దయన్నకు ఓటు గుద్దాలి…కాంగ్రెసోళ్లు ప్రతీ రైతుకు 15వేలు అంటున్నరు. కేసీఆర్ మాత్రం ఎకరాకు 16 వేలు ఇస్తడన్నారు.
12 సార్లు రైతుబంధు ఇచ్చిన కేసీఆర్ గెలవాల్నా? 12 మంది ముఖ్యమంత్రులు ఉన్న కాంగ్రెస్ గెలవాల్నా? ఆలోచించాలన్నారు. ఓడినోడు నేనే ముఖ్యమంత్రి అంటడు, గెలిచినోడు నేనే ముఖ్యమంత్రి అంటడు. ఇలాంటి కాంగ్రెస్ చేతిలో రాష్ట్రాన్ని పెట్టి రిస్క్ తీసుకుందామా?..గతంలో తండాలకు కరెంటు లేదు, నీళ్లు రావు, రోడ్డు లేకుండే. కానీ దయాకరన్న గెలిచిన తర్వాత డాంబర్ రోడ్డు, ఇంటింటికీ నీళ్లు, 24గంటల కరెంట్ వచ్చింది. ముఖ్యంగా తండాలు గ్రామపంచాయితీలు అయ్యాయని చెప్పారు.
కాంగ్రెస్ వస్తే కరువు వస్తది. కాంగ్రెస్ వస్తే రైతుబంధు పోతది. కాంగ్రెస్ వస్తే కరెంట్ కట్ అయితదని…కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీలో ఉంటే కేసీఆర్ కి హైకమాండ్ ప్రజలే అన్నారు. మన ఇంటి పార్టీ, మన కేసీఆర్ ని మూడోసారి గెలిపించుకుందాం అన్నారు.
Also Read:Chiranjeevi: మెగా ఫ్యాన్స్ కు పూనకాలే!